శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (23:46 IST)

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పథకాలే ప్రచార అస్త్రాలు: అలా సీఎం జగన్‌కు కానుకగా ఇవ్వాలి

సత్యవేడు నియోజక వర్గంలోని పిచ్చాటూరు మండల వైఎస్ఆర్ సీపీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంఎల్ఏ ఆదిమూలం తో కలసి దిశ నిర్దేశం చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.
 
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రచార అస్త్రాలుగా ఉపయోగించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. తిరుపతి ఎంపి ఉపఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డా గురుమూర్తి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుటకు కృషి చేయాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు.

ఎంఎల్ఏ ఆదిమూలంతో శ్రీకాంత్ రెడ్డి కలసి పిచ్చాటూరు  మండలంలోని వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లతోనూ, ఎం పి టి సిల తోనూ, మండల, గ్రామనాయకులు తోనూ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఉపఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించి నెంబర్ 1 స్థానంలో నిలిపి ముఖ్యమంత్రి జగన్ కు కానుకగా అందించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.