మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (15:13 IST)

150 సెగ్మెంట్లలో 'తలైవా' ఓటు బ్యాంకు - సర్కారు బెంబేలు...

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ పడుతున్నారు. ఇందుకోసం వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
 
అయితే, తమిళనాడులోని అత్యధిక శాసనసభ నియోజకవర్గాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మంచి ఆకర్షణ ఉన్నట్టు ఓ రహస్య సర్వే తేల్చింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ సర్వేను చూసిన అధికార అన్నాడీఎంకే దీంతో కంగుతిన్న సర్కారు అప్రమత్తమైనట్లు తెలిసింది. 
 
రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేసినప్పటికీ ఇప్పటివరకు పార్టీని మాత్రం రజనీకాంత్‌ ప్రారంభించలేదు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడులో ఆయనకు ప్రజామద్దతు ఎలా ఉందనే విషయాన్ని నిఘావర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య సర్వే చేయించిందని సమాచారం. 
 
రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు ఉందనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు 35 నుంచి 40 శాతం మేరకు ఓటు బ్యాంకు సిద్ధమైందని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 15 శాతం దళితులు, 8 శాతం మైనారిటీలు, 15 శాతం ఇతర సామాజికవర్గం, రాజకీయ అసంతృప్తులు ఉన్నారని ప్రభుత్వానికి అందించిన నివేదికలో నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం.