గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అధికారుల ఉదాసీనత వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య : టీడీపీ చీఫ్ చంద్రబాబు

chandrababu naidu
విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక ఉపాధ్యాయుడిని చర్‌ను చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. 
 
విజయనగరం జిల్లా రాజాంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) శనివారం ఉదయం దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఆయనను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 
 
పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు. 
 
ఉపాధ్యాయుడిని చంపేశారు... 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన టీడీపీ మద్దతుదారుడు కావడమే ఈ హత్యకు కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మృతుడి పేరు ఏగిరెడ్డి కృష్ణ (58). బోలెరో వాహనంతో ఢీకొట్టించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. శనివారం ఉదయం ఇంటి నుంచి కృష్ణ తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు వెళుతున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద ప్రత్యర్థి వర్గం బోలెరో వాహనంతో ఆయన్ను ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన కృష్ణపై దాడి చేసి చంపేశారు. చనిపోయేముందు కళ్లలో కారం కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. మృతదేహం భయానక స్థితిలో ఉంది. దీంతో కృష్ణది హత్యేనని ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆరోపిస్తూ, హత్యా స్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. 
 
దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా, కృష్ణను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తేలింది. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఉద్దవోలుకు మరడాన వెంకట నాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడు గతంలో టీడీపీ తరపున గ్రామ సర్పించిగా కూడా పనిచేశారు.