బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (14:41 IST)

వరద బాధిత కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు

వరద బాధిత జిల్లాల్లో ఒకటై కడప జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆవచ్చారు. ఆయనకు కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన జిల్లాలో వరద తీవ్రంగా ఉన్న రాజంపేట, నందలూరు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే, పూలపత్తూరు, మందపల్లి, తోగూరుపేట్, గండ్లూరు గ్రామాల్లో కూడా బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. మంగళవారం రాత్రి వరకు కడప జిల్లాలో పర్యటించే ఆయన.. బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు.