మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (09:45 IST)

హత్యా రాజకీయాల వారసుడు సీఎం జగన్ రెడ్డి: లోకేష్ నాయుడు ఫైర్!!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త‌న ట్వీట్ల వాడి, వేడిని త‌గ్గించ‌డం లేదు. అస‌లు త‌గ్గేదే లే అన్న‌ట్లు పోటా పోటీగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై కామెంట్స్ చేస్తున్నారు. త‌న‌దైన శైలిలో దూకుడును లోకేష్ ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
 
 
హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రశ్నించే వారిపై  దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారింది. పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, గుండ్లపాడు గ్రామంలో వైసిపి ఫ్యాక్షన్ మూకలు టిడిపి గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యని దారుణంగా హత్య చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.  ఈ ఘోరానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి. అరాచకం రాజ్యమేలుతున్న మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతత కోసం అందరూ ఒక్కటై పోరాడాలి. చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంద‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు.