ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (07:16 IST)

విశాఖలో తిరుపతి వెంకన్న

తిరుపతి భక్తులకు ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం. ప్రపచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయం. స్వామిని చూసి తరించాలని కూడా ఎంతో మంచి ఆశిస్తారు. తిరుపతికి ప్రతి నిత్యం వెల్లువలా జనం వస్తూంటారు.
 
విశాఖవాసులకు తిరుమల అంటే కడు దూరమే. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వారంతా తిరుపతి వస్తారు. ఇపుడు అటువంటి భక్త జనుల కోసం టీటీడీ పాతిక కోట్ల రూపాయల వ్యయంలో పదెకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తున్న వెంకన్న ఆలయం ఇపుడు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

మూడేళ్ళ క్రితం ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యయి. ఇక ఈ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ట్ర అంకురార్పణ కార్యక్రమాలు ఈ నెల 9 నుంచి మొదలు కానున్నాయి.
ఈ నెల 13న ఈ ఆలయాన్ని ప్రారంభిస్తారు అంటున్నారు. విశాఖ సాగర తీరం రుషికొండ వద్ద నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభతో ఇకమీదట విలసిల్లనుంది. మొత్తానికి భక్తుల కోసం వెంకన్న విశాఖలో కొలువుతీరాడని ఆధ్యాత్మికపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.