శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (18:59 IST)

ట్రాన్స్‌జెండర్‌పై 15మంది అత్యాచారం.. కంప చెట్లలో పడేసి వెళ్లారు..

rape
కడప జిల్లాలోని పులివెందులలో దారుణం జరిగింది. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళేరోడ్డులో ట్రాన్స్ జెండర్‌పై 15 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి చేసి మరీ అత్యాచారం జరిపి కంప చెట్లలో పడేసి వెళ్లారని బాధితురాలి తరపున ట్రాన్స్ జెండర్లు వెల్లడించారు. 
 
పులివెందుల పోలీస్‌ స్టేషన్‌లో న్యాయం కోసం ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరంలేక దిశయాప్‌కు కాల్ చేసిన తర్వాత స్పందించారని తెలిపారు.
 
అత్యాచారం ఘటనలో తమకు న్యాయం చేయకపోతే పులివెందుల ట్రాన్స్ జెండర్స్ అందరం కలసి ఆత్మహత్య చేసుకుంటామని ట్రాన్స్‌ జెండర్లు హెచ్చరించారు.