బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 9 మే 2019 (21:24 IST)

ఇంటికి వాస్తు దెబ్బ కొడుతుందని గర్భ గుడికి గోడ కట్టించాడు...

గుడి ఎత్తును పెంచడంతో తన ఇంటి వాస్తుకు ఇబ్బందిగా వుంటుందని భావించిన ఓ పెత్తందారు గుడి గర్భగుడికి అడ్డుగోడ కట్టి పూజలు జరుగకుండా చేసాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్న గురకుల గ్రామంలో చోటుచేసుకుంది. 
 
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం జొన్న గురకులలో యాదవలు తమ కులదైవమైన కృష్ణుని భజన మందిరాన్ని 1911లో ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి వారం ఉరేగింపు కూడా చేసుకుంటున్నారు. మందిరం పాతబడటంతో దేవాలయాన్ని పునర్మిణాం చేసారు. గర్భగుడి కట్టారు. దీంతో దేవాలయం ఎత్తు పెంచారు. 
 
తన ఇంటి కంటే దేవాలయం ఎత్తు పెరిగితే తనకు వాస్తు ప్రకారం ఇబ్బంది అని భావించిన ప్రతాప్ రెడ్డి అనే పెత్తందారు గర్భగుడి ద్వారానికి గోడ కట్టించాడు. దీంతో పూజలు ఆగిపోయాయి. స్థానికంగా పోలీసులు ‌వచ్చినా తనకున్న రాజకీయ పలుకుబడితో వారిని నిలువరించాడు. చివరకు గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.