బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:05 IST)

నిజాయతీగా పని చేస్తాం.. టీటీడీ ఉద్యోగుల ప్రతిజ్ఞ

కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్(సివిసి) పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా ‌అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వ‌హిస్తున్న అవినీతి వ్య‌తిరేక‌, భ‌ద్ర‌తా అవ‌గాహ‌న వారోత్సవాలను మంగ‌ళ‌వారం టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు. 
 
మంగ‌ళ‌వారం ఉద‌యం సివిఎస్వో గోపినాథ్ జెట్టి ఆధ్వ‌ర్యంలో  టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం వ‌ద్ద  అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో తాము అవినీతికి వ్య‌తిరేకంగా తాము సంస్థ ప్ర‌యోజ‌నాలు కాపాడుతూ ప‌ని చేస్తామ‌ని ఈవో ప్ర‌తిజ్ఞ చేయించారు.

ఉద్యోగులు, అధికారులు నైతిక ధోర‌ణిని ప్రోత్స‌హిస్తూ, నిజాయి‌తి, స‌మైక్య‌త‌తో పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జయంతిని పుర‌స్క‌రించుకుని ప్రారంభ‌మైన ఈ వారోత్స‌వాలు న‌వంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు పి.బ‌సంత్‌కుమార్‌, స‌దా భార్గ‌వి,సిఇ ర‌మేష్ రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, మ‌నోహ‌ర్‌ పాల్గొన్నారు.‌