గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (18:45 IST)

ఏపీలో రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్టిస్తాం... వెయిట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోడ్లన్నింటికీ మహర్దశ పట్టిస్తామన్న ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. విజయవాడలో సోమ‌వారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణ బాబు మాట్లాడుతూ, ఆర్ అండ్ బీ పరిధిలోకి వచ్చే రోడ్లను సత్వరమే మరమ్మతులు, నిర్మాణం చేయాలన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు సహా కొత్త రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
 
ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయ‌ని ఇటీవ‌ల టీడీపీ, బీజేపీ ఇత‌ర ప్ర‌తిక్ష నేత‌లు ధ‌ర్నాలు, ఉద్య‌మాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అయితే, రోడ్ల‌పై బైఠాయించి నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. అయితే, ఇపుడు న‌డుస్తున్న‌ది వ‌ర్షాకాలం.

ఇలాగే ఉంటుందని, వ‌ర్షాలు త‌గ్గాక రోడ్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేస్తామ‌ని అధికార‌ప‌క్ష నేత‌లు చెప్పుకొస్తున్నారు. టీడీపీది అంతా ఓవ‌ర్ యాక్ష‌న్ అని, తాము త్వ‌ర‌లో మ‌ర‌మ్మ‌తులు చేస్తామ‌ని తెలిసే వారు ఈ ఉద్య‌మాలు రోడ్ల‌పై చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.