టిడిపి పాలనలో ఎమ్మెల్యే తన చుట్టు పక్కల రోడ్లు కూడా నిర్మించుకో లేక పోయారని ఇది టిడిపి కి నగర అభివృద్ది పై ఉన్న చిత్తశుద్ది అని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
బుదవారం విజయవాడ నగర అభివృద్ది కి కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు, తొలుత 36 వ డివిజన్ ఇస్మాయిల్ విదిలో 18.22 లక్షల రూపాయల తో సిమెంట్ రోడ్డు పనులకు మరియు 40 వ డివిజన్ కాళేశ్వర రావు మార్కెట్ నుంచి కెనాల్ వరకు కోటి ముప్పై ఒకటి లక్షల రూపాయల స్టారమ్ వాటర్ మళ్ళింపు చేయుటకు 1200 ఎమ్ ఎమ్ ఆర్ సి పిపీ రెండు వరుసుల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కలిసి పలు విధుల్లో మంత్రి పర్యటించారు స్థానికుల ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ది అన్న రీతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుందని గత ఐదు సంవత్సరాలలో విజయవాడ నగరం రోడ్ల అభివృద్ది కి కూడా నోచుకోలేదన్నారు కనీసం 40 వ డివిజన్ మసీదు ముందు రోడ్ల సైతం పట్టించుకో లేదన్నారు.
నగరానికి వర్షపు నీరు ముంపు గురి కాకుండా ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నిధులు మంజూరీ చేయించి యాభై శాతం పనులు పూర్తి చేసిన ... టిడిపి ఐదు సంవత్సరాల అధికారం లో మిగిలిన యాభై శాతం పనులు కూడా పూర్తి చెయ్యలేక పోయిందన్నారు.
టిడిపి పాలనలో ఎమ్మెల్యే తన ఇంటి చుట్టూ రహదారుల కు కూడా రోడ్లు వేయించుకొలేక పోయారని అన్నారు, చిన్నపాటి వర్షానికి కూడా విజయవాడ నగరం ముంపు కు గురి అవుతుందని వీటికి శాశ్వత నివారణ లో బాగంగా రెయిన్ వాటర్ డైవర్షన్ పనులకు నిధులను తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మంజూరు చేయించటం జరిగిందని గుర్తు చేశారు.
వై యస్ అర్ సిపి ప్రభుత్వానికి అభివృద్ది తప్ప వివక్షత లేదని వై యస్ అర్ సిపి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ది కార్యక్రమాల కోసం నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఆ రహదారుల నిర్మాణం తో పాటు వర్షపు నీరు డైవర్షన్ కాలువ సంబందించిన అసంపూర్తిగా ఉన్న యాభై శాతం పనులు కూడా పూర్తి చేసేందుకే ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు, విజయవాడ నగరానికి బ్రిటిష్ కాలంలో నిర్మించిన డ్రైనేజ్ వ్యవస్థ తో అనేక ఇబ్బందులు పడుతున్నామని వాటిని అదునికరిస్తు పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు...
కార్యక్రమం లో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇంజనీరింగ్ విభాగం డియి లు మరియు మాజీ కార్పొరేటర్ లు అసిఫ్,జాన్ బి, అప్పాజీ పూర్ణ,40,39,30 డివిజన్ అద్యక్షులు వాహబ్, గ్రంధి బుజ్జి, వెన్నం రజనీ వై యస్ అర్ సిపి నాయకులు మండేపుడి చటర్జీ, మైలవరపు దుర్గా రావు,పిల్లా రవి, నాహిద్, సైకం సాయి రామ్, ఇమామ్,మధిర ప్రభాకర్, మనోజ్ కొఠారి, మొహమ్మద్, ఖాదర్ వలీ, ఎలుకల చలపతి రావు తదితరులు పాల్గొన్నారు.