శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:52 IST)

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వెస్లీకి ఎస్పీ నివాళి

మాజీ దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భద్రత అధికారిగా విధులు నిర్వహిస్తూ,హెలికాప్టర్  ప్రమాదంలో మరణించిన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీకి పోలీసులు నివాళులు అర్పించారు. 
 
వెస్లీ 12 వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు చర్చి సెంటర్ వద్ద సాల్మన్ విగ్రహానికి ప్రకాశం జిల్లా ఎస్పీ మ‌ల్లిక  గర్గ్ నివాళులు అర్పించారు. వెస్లీ కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా ఎస్పీ పిలిపించి, వెస్లీ విగ్ర‌హానికి పూలమాల వేయించి  ఘనంగా నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీ మలిక గర్గ్ మాట్లాడుతూ, సాల్మన్ పోలీస్ శాఖ గౌర‌వాన్ని ఇడుమడింపజేసేలా విధంగా విధులు నిర్వహించారని అన్నారు. ఆయ‌న ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండటం గర్వించదగిన విషయమని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి.రవిచంద్ర, డిఎస్ బి డిఎస్పీ బి.మరియదాసు, ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.