ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-01-2021 సోమవారం మీ రాశిఫలాలు - ఇంట్లో మార్పులు చేర్పులు..

మేషం : ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోడి. ప్రియతముల కోసం, సంతానం కోసం ధనంబాగా వెచ్చిస్తారు. స్త్రీలు, టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. 
 
వృషభం : ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలను సాధిస్తారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమవుతోందని గమనించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మీపై అధికారులతో ధోరణితో మార్పు కనిపిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. 
 
కర్కాటకం : హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. రుణ విముక్తులు కావడంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సివస్తుంది. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. 
 
సింహం : ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పాతబాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కన్య : ఉద్యోగస్తులకు తోటివారిని విమర్శించడటం వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
తుల : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులు అభివృద్ధికి పొందుతారు. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి  భంగం కలుగవచ్చు. 
 
వృశ్చికం : బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. దైవ కార్యాల పట్ల శ్రద్ధ వహిస్తారు. నూతన వాతావరణం, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు, ప్రయాణాలు వ్యాపార లావాదేవీలపై శ్రద్ధ చూపుతారు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి.
 
ధనస్సు : విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు. కోర్టు పనులు వాయిదాపడటం మంచిదని గమనించండి. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. 
 
మకరం : వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఉద్యోగస్తులు అధికారులతో మాటపడక తప్పదు. గృహ నిర్మాణాలకు కావలసిన బ్యాంకు రుణాలు మంజూరుకాగలవు. 
 
కుంభం : పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. రావలసిన మొండిబాకీలు ఆలస్యమైనా వసూలు అవుతాయి. సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. 
 
మీనం : సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ధాన్యం, కలప, పేపరు, యాంత్రిక వ్యాపారస్తులశ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.