శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-11-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...

మేషం : దైవ సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. రావలసిన ధన సకాలంలో అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
వృషభం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. పూర్వపు మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు చికాకులను ఎదుర్కొంటారు. 
 
మిథునం : వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం, పచారీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రాజీమార్గంలో ఆస్తి, స్థల వివారాలు  పరిష్కారం కాగలవు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ఉన్నతస్థాయి అధికారులకు కింది స్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు, పెట్టిపోతలు అతిథులను ఆకట్టుకుంటాయి. 
 
కర్కాటకం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ వహించండి. ఇచ్చిపుచ్చుకునే విషయాలు పెట్టిపోతలలో పెద్దల సలహా పాటించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. గృహంలో చిన్నచిన్న సమస్యలు చికాకులు తలెత్తుతాయి. 
 
సింహం : వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. విదేశీయానం, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. శత్రువులు, మిత్రులుగా మారతారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. స్పెక్యులేషన్ సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతోషం కలిగిస్తుంది. 
 
కన్య : స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడక తప్పదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనిరారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వ్యవసాయ రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నూతన వస్తువుల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
తుల : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సంఘంలో పలుకుబబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. 
 
వృశ్చికం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, అధికం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
మకరం : రిప్రజెంటేటివ్‌ల శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురకుగా పాల్గొంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కుంభం : ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించ వలసి ఉంటుంది. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. 
 
మీనం : ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.