మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (09:08 IST)

26-10-2018 శుక్రవారం దినఫలాలు - ఆర్థికంగా ఒక అడుగు ముందుకు..

మేషం: ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. 
 
వృషభం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఇరుగుపొరుగు వారి నుండి విమర్శలను ఎదుర్కుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఆందోళన కలిగిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.  
 
మిధునం: కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థులకు అతి ఉత్సాహం తగదని గమనించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.  
 
కర్కాటకం: ఆర్థికంగా బాగుగా స్థిరపడుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సోదరిసోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా అమ్మకానికే చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. 
 
సింహం: అందరికి సహాయం అందించి మాటపడుతారు. కిరాణా, ఫ్యాన్సీ, కిళ్ళి, మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇప్పటి వరకు విరోధంగా ఉన్నవారు మీ సహాయం అర్ధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.  
 
కన్య: సొంతవ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
తుల: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలస్యమైన అనుకున్న పనులు పూర్తిచేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విదేశాలు వేళ్ళాలి అనే ఆలోచనను క్రియారూపంలో పెట్టండి. స్నేహితుల, బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.  
 
వృశ్చికం: ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు ఎదుర్కుంటారు. కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అయిన వారి సలహా తీసుకోవడం మంచిది.  
 
ధనస్సు: వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు, చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. రవాణా, ఆటోమోబైల్, మెకానికర్ రంగాలలో వారికి సంతృప్తికానవస్తుంది. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయమని గమనించగలరు. ప్రముఖుల కలయికతో మీ పనులు సానుకూలమవుతాయి.  
 
మకరం: పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. స్త్రీలు తాము అనుకున్నది సాధించగలుగుతారు. పొట్ట, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికం. మీ హోదాకు తగినట్టుగా ధనవ్యయం చేయవలసి వస్తుంది. ఇతరులకు సలహాలిచ్చి ఇబ్బందులకు గురికాకండి.  
 
కుంభం: స్త్రీలకు అనుకోని అభివృద్ధి, గుర్తింపు లభిస్తుంది. పాత వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తేగలగుతారు. నిరుద్యోగులు నిర్లక్ష్యం వలన మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా వినీ మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి.  
 
మీనం: వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. వివాదస్పదాలతో తలదూర్చకండి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. క్రీడల పట్ల, వస్తువుల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.