గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (12:10 IST)

24-10-2018 బుధవారం దినఫలాలు - భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా...

మేషం: బంధువులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ వలన స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. రాజకీయనాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పదు. 
 
వృషభం: విద్యుత్, ఎ.సి., కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి లభిస్తుంది. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. రావలసిన ధనం అందుతుంది. రాజకీయనాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి.  
 
మిధునం: వృత్తిపరంగా చికాకులు, ఆటుపోట్లు ఎదుర్కుంటారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కానివేళలో ఇతురుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
కర్కాటకం: సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. దంపతుల మధ్య అభిప్రాయబేధాలు, కలహాలు చోటుచేసుకుంటాయి.   
 
సింహం: ఆదాయానికి తగినట్లుగా ధనం వ్యయం చేస్తారు. పారిశ్రామిక వేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆత్మయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం క్షేమదాయకం. దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ముఖ్యుల కోసం షాషింగ్‌లు చేస్తారు.  
 
కన్య: మిమ్ములను చూసి ఆసూయపడే వారు అధికమవుతారు. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. భాగస్వామిక చర్చలు, స్థిరాస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.  
 
తుల: ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లలో పునరాలోచన అవసరం. మిత్రులు పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు, దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు.   
 
వృశ్చికం: పత్రికా సిబ్బందికి పనిభారం ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఇతరులను మీ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంచండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. కుటుంబ, ఆర్థిక విషయాలు కలవరపరుస్తాయి. దూరప్రదేశంలో ఉన్న మీ సంతానం రాకకోసం ఎదురుచూస్తారు. 
 
ధనస్సు: చిన్ననాటి పరిచయస్తులకు కలుసుకుంటారు. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. దైవదర్శనాలల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి.  
 
మకరం: ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూరప్రాంతం నుండి మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు టీవి ఛానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
కుంభం: బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాలలకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్‌లో నిరుత్సాహం తప్పదు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికంగా సమసిపోతుంది. ఖర్చులు పేరిగినా ఇబ్బంది ఉండదు. 
 
మీనం: స్త్రీల ఏమరుపాటు వలన ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. వ్యవహార ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు తగ్గించుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఏజెన్సీలు, లీజు గడువు పెంపులు అనుకూలిస్తాయి.