సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-03-2024 ఆదివారం దినఫలాలు - ఆ రంగాల వారికి శుభదాయకం

astro3
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ ఐ|| అష్టమి తె. 3.25 అనూరాధ ఉ.11.18. సా.వ.4.58 ల 6.35. సా.దు. 4.29 ల 5.16.
 
మేషం :- మీ పెద్దల ధోరణి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావచ్చు. దస్త్రం వివాహ, శుభకార్యాలకు సంప్రదింపులు జరుపుతారు. మీరు తీసుకున్న నిర్ణయం మొదటిలో కాస్త ఇబ్బంది అనిపించినా క్రమేణా అదే మంచిదనిపిస్తుంది.
 
వృషభం :- కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఏ వ్యవహారం కలిసిరాకపోవడంతో ఆందోళన చెందుతారు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పని వారాలకు శుభదాయకం.
 
మిథునం :- కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లనిపానీయ, తినుబండారు వ్యాపారులకు లాభం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కర్కాటకం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. దూర ప్రయాణాలలో ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటుచేసుకుంటాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అన్ని విధాల కలసిరాగలదు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
సింహం :- ఆర్థికలావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. స్త్రీలు ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించటం మంచిది. కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్య, రంగాల వారికి అనుకూలమైన సమయం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. సాహిత్యవేత్తలకు ప్రత్యేక గుర్తింపు లభించును.
 
కన్య :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. సోదరి, సోదరుల మధ్య మనస్ఫర్థలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలోఅపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
తుల :- కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగును. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, కళా రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
వృశ్చికం :- శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. ఉద్యోగస్తులకు అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. రాజకీయ నాయకులకు కలిసివచ్చును. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- ప్రైవేటు సంస్థలలోని వారికి లౌక్యం అవసరం. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తప్పవు. మీ అభిరుచులకు తగినవిధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. శతృవులపై విజయం సాధిస్తారు. సంతానాభివృద్ధి బాగుంటుంది.
 
మకరం :- వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వం నందు పనిచేయు ఉద్యోగులకు లాభములు చేకూరును.
 
కుంభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు లావాదేవీలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. లీజు, ఏజెన్సీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు తోటివారి ధోరణి చికాకు పరుస్తుంది. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేస్తారు.