ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-04-202 మంగళవారం దినఫలాలు - వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు...

Mithunam
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ రా.10.14 రేవతి ఉ.8.35 తె.వ.3.25 ల 4.55. ఉ. దు. 8.24 ల 9.12 రా.దు. 10.52 ల 11.39.
 
మేషం :- బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలేకపోతారు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రమాదాలు, వివాదాస్పదాల్లో ఇరుక్కునే ఆస్కారం ఉంది. రాజకీయాలలో వారికి మంచిగుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతుంది. 
 
మిథునం :- రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. అపరిచితుల వల్ల సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం ఉత్తమం. కొన్ని వ్యవహారాలు ధనవ్యయంతోనే సానుకూలమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం :- రాజకీయనాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
సింహం :- చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి. ఎదురుచూడని అవకాశాలు దగ్గరకు వస్తాయి. కుటుంబీకుల పట్ల ఆసక్తి పెరుగును. తోటివారి నుంచి స్వల్ప పేచీలు ఉండగలవు. ఖర్చులు, ధనసహాయం విషయంలో మెలకువలు అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళనకలిగిస్తుంది.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ప్రతీ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగానే ఉంటాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి.
 
తుల :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. న్యాయవాదులతో సంప్రదింపులుచేస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక వ్యవహరాలు, కుటుంబ విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా మెలగండి. స్త్రీలు పట్టుదలతో శ్రమించి కొన్నిలక్ష్యాలు సాధిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఒకానొక విషయంలో బంధువులతీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
ధనస్సు :- ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. స్త్రీలకు సంతానం, పనివారలతో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. 
 
మకరం :- దంపతుల మధ్య అవగాహన లోపం, చిన్న చిన్న కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది.
 
కుంభం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అలసట, అధిక శ్రమ వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు కొత్త ఆలోచనలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
మీనం :- ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్నవస్తువు దక్కించుకుంటారు. విద్యార్థులు కొత్త ఆలోచనలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు ప్రయాణాలు వాయిదాపడతాయి.