బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-05-2024 గురువారం దినఫలాలు - దంపతుల మధ్య అభిప్రాయభేదాలు

couples
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ పూర్ణిమ సా. 6.37 విశాఖ ఉ.8.52 ప.వ.1.03 2.43. ఉ.దు. 9. 50 ల 10.40 ప.దు. 2. 53 ల 3.43.
 
మేషం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. బ్యాంక్ వ్యవహారాలలో పనులు చురుకుగా సాగుతాయి. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
 
వృషభం :- ప్రైవేటు సంస్థల్లోని వారికి పై అధికారుల వలన చికాకు, ఒత్తిడులు వంటివి అధికమవుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. మీ ఔదార్యాన్ని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాసం ఉంది. జాగ్రత్త వహించండి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ఆశించినంత లాభదాయకంగా సాగవు. వైద్య శిబిరంలోని వారు  తరచూ ఒత్తిడులకు గురవుతారు. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలునెలకొంటాయి. అక్కౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం :- ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. 
 
సింహం :- ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికిఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖులతో కీలకనమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. మిత్రులను కలుసుకుంటారు.
 
కన్య :- వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి ఆర్ధికాభివృద్ధి పొందుతారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. చేతివృత్తులు, కేటరింగ్ పనివారలకు పురోభివృద్ధి లభిస్తుంది. నూతన పరిచయాలేర్పడతాయి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
తుల :- మీ జీవితభాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు టార్గెట్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. స్నేహితులు మీ సహాయాన్ని అర్థిస్తారు.
 
ధనస్సు :- ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల యందు ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపుతారు.
 
మకరం :– ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.
 
కుంభం :- ఆలయాలను సందర్శిస్తారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. బిల్లులు చెల్లిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం.
 
మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి.