శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-10-2021 మంగళవారం దినఫలాలు .. మంగళ గౌరిదేవిని ఆరాధించినా...

మేషం :- బ్యాంకు వ్యవహారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, పనిభారం తప్పవు. మీ కళత్ర సహకారంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. ఎదుటివారి ఆంతర్యాన్ని గమనించి ముందుకుసాగండి. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే ఆస్కారం ఉంది.
 
వృషభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంలబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
మిథునం :- వాతావరణంలో మార్పు వ్యవసాయ, తోటల రంగాల వారికి సంతోషం కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయం మీ ఉన్నతికి దోహదం చేస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మొండి బాకీల వసూలుతాగలవు.
 
కర్కాటకం :- వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
సింహం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార రంగంలోని వారికి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. స్త్రీలు క్రీడ, ఇతర పోటీల్లో రాణిస్తారు.
 
కన్య :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించండి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు.
 
తుల :- స్థిరాస్తి కొనుగోలు చేయుయత్నాలు వాయిదా పడతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం ఆలస్యంగా అందటం వల్ల ఒడిదుడుకులు తప్పవు. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. పుణ్యకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
వృశ్చికం :- ఆర్థిక కార్యకలాపాలలో మెళకువ అవసరం. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
ధనస్సు :- వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలు కళాత్మక పోటీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ ఆశయసాధనకు ఉన్నతస్థాయి వ్యక్తులు సహకాంహకారం లభిస్తుంది. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మకరం :- పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశ ఉంది. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.
 
కుంభం :- దంపతుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఎదుటివారిలో తప్పులను వెదికే ప్రయత్నాలను విరమించండి. మీ అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి నిరుద్యోగులకుదూర ప్రాంతాల నుండి సదవకాశాలు లభిస్తాయి.
 
మీనం :- భాగస్వామికుల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు.