శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 31 మే 2021 (23:14 IST)

01-06-2021 నుంచి 30-06-2021 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం యోగదాయకమే. వ్యవహార జయం, ధనలాభం వున్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం సందడిగా వుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. మీ జోక్యంతో ఓ సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన ముఖ్యం. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. వాహనచోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. విద్యాసంస్థలకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. వేడుకకు హాజరు కాలేరు. బంధుమిత్రులతో పట్టింపులెదురవుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారలకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినస్తాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాలభోజనం, శ్రమ అధికం. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు స్థానచలనం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త, 1, 2 పాదాలు
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం వుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రధమార్థం నిరాశాజనకం. శ్రమించినా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఆత్మీయుల సాయం అందుతుంది. పనుల్లో అవాంతరాలెదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. గృహమార్పు కలిసివస్తుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రతికూలతలెదురైనా అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు దక్కవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఎంత శ్రమించినా ఫలితం వుండదు. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించాలి. వేడుకకు హాజరవుతారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెట్టుబడులు కలిసిరావు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. స్థిమితంగా వుండటానికి యత్నించండి. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు  మరింత శ్రమించాలి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. అధికారులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. వృత్తుల వారికి వారికి సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. దంపతుల వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. రవాణా, సేవా రంగాల వారికి పురోభివృద్ధి. జూదాలు, బెట్టింగులు జోలికి పోవద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి శుభదాయకమే. కష్టం ఫలిస్తుంది. పదువులు అందుకుంటారు. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఉత్సాహాన్నిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. చిరువ్యాపారాలకు సామాన్యం. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. కొత్త అధికారలకు స్వాగతం పలుకుతారు.