దోషాల వల్ల మంచిమంచి అవకాశాలు చేజారిపోతుంటాయి(శివ.పి- పిఠాపురం)
శివ.పి- పిఠాపురం: మీరు ఏకాదశి సోమవారం, సింహలగ్నము, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడి ఉండటం వల్ల శేషనాగ సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన సర్వదా శుభం కలుగుతుంది. ఈ దోషాల వల్ల మంచిమంచి అవకాశాలు చేజారిపోవడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదుర్కోవడం, అశాంతి వంటివి ఉండగలవు.
2017 వరకు అర్థమాష్టమ శని దోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2012 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2022 వరకు నెమ్మదిగా అభివృద్ధి ఆ తదుపరి శని మహర్దశ అంతా మంచి యోగాన్ని అనుభవిస్తారు. ఏదైనా దేవాలయంలో కానీ, ఉద్యాన వనంలో కానీ మోదుగ చెట్టున నాటిన శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.