వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది(శ్రీనివాస్- కరీంనగర్)

శ్రీనివాస్- కరీంనగర్: మీరు నవమి ఆదివారం, మకర లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. రాజ్య లేక ఉద్యోగ స్థానము నందు శుక్ర యముడు ఉండటం వల్ల మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ప్రతిరోజూ బాలగణపతిని తెల్లని పూలతో పూజించడం వల్ల సత్ఫలితాలు అభివ

Raman| Last Modified శనివారం, 28 మే 2016 (14:18 IST)
శ్రీనివాస్- కరీంనగర్: మీరు నవమి ఆదివారం, మకర లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. రాజ్య లేక ఉద్యోగ స్థానము నందు శుక్ర యముడు ఉండటం వల్ల మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ప్రతిరోజూ బాలగణపతిని తెల్లని పూలతో పూజించడం వల్ల సత్ఫలితాలు అభివృద్ధి ఉంటుంది. 2016 అక్టోబరు నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. 2017 నందు మీరు బాగుగా స్థిరపడతారు.

2020 వరకు బుధ మహర్దశ మీకు సామాన్యంగా ఉండగలదు. 2020 నుంచి కేతు మహర్దశ 7 సంవత్సరములు, శుక్ర మహర్దశ 20 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. వివాహానంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఏదైనా ఉద్యానవనాల్లో వేప చెట్టును నాటిన దోషాలు తొలగి శుభం, జయం చేకూరుతుంది.

గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.దీనిపై మరింత చదవండి :