శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (23:06 IST)

21-02-2021 నుంచి 27-02-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమ, ఒత్తిడి అధికం. రోజువారీ ఖర్చులే వుంటాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనులు సానుకూలమవుతాయి. ఆది, సోమ వారాలలో బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో సంబంధాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. మీ రాక ఆప్తులకు సంతోషపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతృప్తినిస్తుంది. సోదరీ, సోదరులతో అవగాహనకు వస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలన దీటుగా ఎదుర్కొంటారు. క్రీడ, కళాకారలకు ఆదరణ లభిస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వుండాల్సిన సమయం. పంతాలు, పట్టుదలకు పోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. మంగళ, బుధ వారాలలో ముఖ్యుల సందర్శనం వీలుపడదు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులెదురవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుక్ర, శని వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. పుణ్య, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. ఆది, గురు వారాల్లో పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయివారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. న్యాయ, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వాహనచోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలదాయకమే. మీదైన రంగంలో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. బంధుమిత్రులు మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లౌక్యంగా వ్యవహరించాలి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బుధ, గురు వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు పనిభారం. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సందేశాలు, ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వుండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. అకౌంట్స్, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనలు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో వుంచుకోండి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. ఆచితూచి వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్ర, శని వారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. రాబడిపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చేతి వృత్తుల వారికి ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సోమ, మంగళ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఈ చికాకులు తాత్కాలికమే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులతో ముచ్చటిస్తారు. గత అనుభవాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు విస్తరిస్తాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. బుధవారం నాడు విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. సౌమ్యంగా మెలగండి. ఎవరినీ నిందించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి అధికం. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక మిత్రులకు ఉత్సాహాన్నిస్తుంది.