బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 2 జనవరి 2021 (22:27 IST)

3-1-2021 నుంచి 9-1-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా వుండాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు ధనయోగం. ప్రయాణంలో అవస్తలెదుర్కొంటారు.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర, 1, 2 పాదాలు
ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యవహారాలతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. శని, ఆది వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఉద్యోగస్తులకు క్లయింలు, అడ్వాన్సులు మంజూరవుతాయి. అధికారులకు హోదా మార్పు, వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. హోల్‌సేల్ వ్యాపారులకు సమస్యలెదురవుతాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. రాజీమార్గంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఒత్తిడి, ఆందోళన తొలగుతాయి. ధన లాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మాటతీరు అదుపులో వుంచుకోవాలి. వాగ్వాదాలకు దిగవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. కళాత్మక పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ధనయోగం వుంది. ఖర్చులు సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు.కొత్త పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిక్యత ప్రదర్శించవద్దు. అనునయంగా మెలగాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అకారణంగా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ధనయోగం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక స్థితి ఆశాజనకం. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు పనిభారం, విశ్రాంతిలోపం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. బుధవారం నాడు పనులు అర్థాంతరంగా నిలిచిపోతాయి. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు సామాన్యం. బెట్టింగులకు పాల్పడవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. రావలసిన ధనం అందుతుంది. వ్యవహారాలతో తీరిక వుండదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. దైవ, పుణ్య కార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ధనలాభం వుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. క్రీడాపోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు అధికం. సంతృప్తికరం. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వేడుకకు సన్నాహాలు చేస్తారు. పూర్వ విద్యార్థుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తుంపు వుండదు. వ్యాపారాలో చికాకులు మినహా ఇబ్బందులుండవు. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది వుండదు. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారానుకూలత వుంది. మానసికంగా కుదుటపడతారు. సంప్రదింపులకు అనుకూలం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బుధ, గురు వారాల్లో పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో స్తబ్దత తొలగుతుంది. అపరిచితును విశ్వసించవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. ఓర్పుతో యత్నం సాగించండి. ప్రకటనలను విశ్వసించవద్దు. పందాలు, పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. సమర్థతతో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించండి. శనివారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు వాయిదా వేసుకుంటారు. పత్రాలు అందుతాయి. లైసెన్సుల రెన్యువల్లో మెలకువ వహించండి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ప్రియతములను కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. బాధ్యతగా వ్యవహరిస్తారు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనం చేతిలో నిలవదు. అవకాశాలను వదులుకోవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలనకు ఆమోదం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.