మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహార జయం, ధనప్రాప్తి ఉన్నాయి. మీదైన రంగంలో రాణిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు అనుకూలం. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. సోమవారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దంపతుల కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఉద్యోగస్తులకు పనిభారం. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సహాయం, సలహాలు ఆశించవద్దు. అదృష్టయోగమే మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. బుధవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానానికి శుభయోగం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. టార్గెట్లు అధికమవుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. దైవదర్శనాలు మానసికోల్లాసాన్నిస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు ఆశించిన చోటికి బదిలీ. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం అనుకూలదాయకం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానానికి శుభయోగం. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. అవివాహితులకు శుభయోగం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్నవిషయానికే ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు అపరిచితులతో మితంగా సంభాషించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉల్లాసాన్నిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. కొత్త వ్యాపారాలకు తరుణం కాదు. హోల్సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగిచండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఖర్చులు విపరీతం అవసరాలు అతికష్టం మీద తీరుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. మంగళవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వాహనదారులకు దూకుడు తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆపన్నులకు సాయం అందిస్తారు. కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణణకు కొంతమంది యత్నిస్తారు. గుంభనంగా మెలగండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. అవివాహితులకు శుభయోగం. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం, కీలకపత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగద్దు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించవద్దు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. సంకల్పబలీమే విజయానికి దోహదపడుతుంది. శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆప్తులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కార్యక్రమాలు ముందుకు సాగువు. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు అధికం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. కీలక విషయాలపై దృష్టి సారిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. సోమవారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యవహార ఒప్పందాలతో తీరిక ఉండదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధ్యాయులకు పదవీయోగం.