మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 29 జులై 2023 (18:54 IST)

30-07-2023 నుంచి 05-08-2023 వరకు మీ వార రాశిఫలాలు

Sagitarus
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
అన్ని విధాలా అనుకూలదాయకం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సోమవారం నాడు వ్యవహారాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. తొందరపాటు నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఉపాధ్యాయులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వస్త్ర, బంగారం, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టసమయం. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. క్రమంగా అనుకూలతలు నెలకొంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. శుక్ర, శని వారాల్లో పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పెట్టుబడులకు తరుణం కాదు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. జాతక పొంతన ప్రధానం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఇంటి విషయాలను పట్టించుకోండి. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహ వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఆలయాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది.
 
 
 
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
 
మనోధైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఒక ఆహ్వానం సంతోషపరుస్తుంది. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. గృహనిర్మాణాలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వివాదాలు పరిష్కార దిశగా 
సాగుతాయి.
 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
 
లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆదాయం సంతృప్తికరం. మొండిబాకీలు వసూలవుతాయి. గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. శుక్ర, శని వారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. చిన్న విషయానికే చికాకు పడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మీ శ్రీమతితో సంభాషణ ఊరటనిస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మనోధైర్యంతో అడుగులేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్నేహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఈ వారం ప్రతికూలతలు అధికం. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. మనోధైర్యంతో మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. ఓర్పుతో ఉద్యోగయత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి.
 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పొదుపునకు అవకాశం లేదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆదివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. స్థిరచరాస్తుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. మంగళ, బుధ వారాల్లో నగదు స్వీకరణలో జాగ్రత్త. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి.