సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (16:03 IST)

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పనుల సానుకూలతకు ఓర్పుతో శ్రమించండి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం అనుకూలించినా ఫలితం ఉండదు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో తొందరపాటు తగదు. అనుభవజ్ఞుల సలహ తీసుకోండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులు నిస్తేజానికి లోనవుతారు. న్యాయ, వైద్య వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విందులకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. కీలక విషయాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పెద్దలతో పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సోమ, మంగళవారాల్లో మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. చేతివృత్తులు, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచికే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని కట్టడి చేయండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ వారం శుభఫలితాలున్నాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధి ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన బదిలీలు. ఉన్నతాధికారులకు హోదా మార్పు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఆప్తులను దైవకార్యం, విందులకు ఆహ్వానిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగా లేదు. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. ఆచితూచి అడుగేయండి. అతిగా ఆలోచింపవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సోమవారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సన్నిహితులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్య ధోరణితో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. బుధవారం నాడు నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సంతానానికి ఉద్యోగయోగం, అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల సహకారంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. గురు, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఆరోగ్య విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆది, సోమవారాల్లో ధనసమస్యలెదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. హోల్సేల్ వ్యాపారులకు కష్టసమయం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారితో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ఉన్నతాధికారులకు హోదామార్పు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. వివరాలు వెల్లడించవద్దు. ఒక శుభవార్త సంతోషాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ద్విచక్రవాహనదారులకు అత్యుత్సాహం తగదు.