గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (16:01 IST)

గరికరసం అంటేనే పారిపోతున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలేంటంటే?

Grass juice
గరిక రసం అంటే వద్దు బాబోయ్ అని పారిపోతున్నారా..? కాస్త ఆగండి.. అందులోని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం పరగడుపున గరిక జ్యూస్‌ను తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఒబిసిటీ సమస్య వేధించదు. ఈ గరిక జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది. రక్తహీనత వుండదు. రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. 
 
* ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. 
* మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ఈ జ్యూస్ నియంత్రిస్తుంది. 
* జలుబు, సైనస్, ఆస్తమా వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. 
* నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలగిస్తుంది. అజీర్తిని మటాష్ చేస్తుంది. 
 
* క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. 
* నిద్రలేమిని దూరం చేస్తుంది. 
* చిగుళ్ల వ్యాధులను దరిచేరనివ్వదు. 
* కీళ్ల నొప్పులకు గరిక రసం తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇక పరగడుపున రోజూ గరిక రసాన్ని ఓ గ్లాసుడు తాగేస్తారుగా..!