శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:53 IST)

ధనియాల పొడి, పసుపుతో ఆ సామర్థ్యం పెరుగుతుందట..

ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డి-విటమిన్ తగ్గడంతో దాంపత్యంలో చాలామందికి ఆసక్తి తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. 
 
కాబట్టి డీ విటమిన్ కలిగిన పుట్టగొడుగులు, కార్న్ ఫ్లేక్స్ తీసుకోవాలి. గుడ్లు, తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పాలకూర, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. 
 
లైంగిక సామర్థ్యం ఆసక్తి తగ్గడానికి మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. దీంతో పాటు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. 
 
బాదం, జీడిపప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్ పుష్కలంగా వుంటుంది. తీరకలేని పనివల్ల అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం. ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.