శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 మార్చి 2023 (17:02 IST)

అర్జున చెట్టు అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Heart
అర్జున చెట్టు లేదా తెల్లమద్ది చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ చెట్టు ఆకులు, కాయలు, బెరడులో పలు ఔషధీయ విలువలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అర్జున చెట్టు హృదయ సంబంధ సమస్యలను అరికట్టడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో తెలుపబడింది.రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, దగ్గును నివారించడం, అదనపు ఆమ్లత్వం హానికరమైన ప్రభావాల నుండి కడుపులోని గోడల్ని రక్షించడంలో అర్జున చెట్టు బెరడు పనిచేస్తుంది.
 
అర్జున చెట్టు బెరడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ-క్లాటింగ్ ఏజెంట్ కావడం వలన ఇది స్ట్రోక్, గుండెపోటును నిరోధిస్తుంది. అర్జున చెట్టు బెరడుకి మరికొన్ని మూలికలు కలిపి తీసుకుంటే శ్వాస అందకపోవడాన్ని, సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుంది. చిన్నపిల్లలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ సమస్యలున్నవారు అర్జున చెట్టు మూలికల్ని వాడరాదు.