శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (19:27 IST)

కానుగ ఆకులే కదా తీసిపారేయకండి.. ఈ నూనెతో దీపం వెలిగిస్తే?

Kanuga Tree
Kanuga Tree
ఔషధీయ గుణాలు కలిగిన మొక్కల్లో కానుగ కూడా ఒకటి. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు అన్నింటికీ పలు రుగ్మతలను అరికట్టే గుణాలున్నాయి. కానుగ చెట్టు పువ్వును రక్తస్రావం హెమోరాయిడ్స్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. పొత్తికడుపులో కణితులు, స్త్రీ జననేంద్రియ అంటువ్యాధులు, అల్సర్లకు కానుగ చెట్టు పండుతో చికిత్స చేస్తారు.
 
మచ్చ కణజాల కణితులు, అధిక రక్తపోటు, రక్తహీనత చికిత్సలకు కానుగచెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు. బ్రోంకటైస్, కోరింత దగ్గు, జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను మృదువుగా చేయడానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు.
 
కానుగ చెట్టు ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే గ్యాస్‌, అసిడిటీ, కడుపులో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతోపాటు దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు కూడా తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. 
 
బాగా వేడిగా ఉండే గంజిలో కానుగ ఆకులను ఒకటి రెండు వేయాలి. కొంత సేపయ్యాక ఆ ఆకులను తీసేయాలి. అనంతరం ఆ గంజిని తాగాలి. ఇలా తాగడం వల్ల వాంతులు తగ్గిపోతాయి. కానుగ గింజల నుంచి తీసే నూనె కూడా మనకు ఉపయోగపడుతుంది.
 
దేవుడికి దీపాలకు పెట్టే నూనెకు బదులుగా కానుగ నూనెను వాడవచ్చు. దీంతో ఆ నూనె కాలడం వల్ల వచ్చే వాసనకు చుట్టూ ఉండే సూక్ష్మ జీవులు నశిస్తాయి. గాలి శుభ్రమవుతుంది.
 
కానుగ నూనెను రాస్తుంటే గజ్జి, తెల్ల మచ్చలు, తామర వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఈ నూనెను కొద్దిగా వేడి చేసి ఛాతిపై రాస్తే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి.