శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (13:58 IST)

మహిళల్లో ఆ సమస్యను దూరం చేసే అశ్వగంధ చూర్ణం..

అశ్వగంధ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ అర స్పూన్ అశ్వగంధాన్ని తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు నిండు యవ్వనం సొంతమవుతుంది.

అశ్వగంధ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ అర స్పూన్ అశ్వగంధాన్ని తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు నిండు యవ్వనం సొంతమవుతుంది. 
 
అలాగే అశ్వగంధ చూర్ణం, శుద్ధి చేసిన పటిక సమపాళ్లలో తీసుకుని కలిపి, ఒక స్పూను మోతాదులో రోజుకు రెండు సార్లు రుతు సమయంలో తీసుకుంటే తెల్లబట్ల తగ్గుతుంది. రెండు స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే.. బాలింతలకు పాలు పడతాయి. 
 
అశ్వగంధ చూర్ణాన్ని పాలు, నువ్వులనూనె, నెయ్యి, గోరువెచ్చని నీరు కలిపి తీసుకుంటే పిల్లలు బాగా పెరుగుతారు. నాలుగు గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తేనె, నెయ్యితో కలిపి పాలతో తీసుకుంటూ ఉంటే వృద్ధాప్యంలో కూడా శరీరం పుష్టిగా తయారవుతుంది. 
 
అశ్వగంధ చూర్ణం, నెయ్యి, చక్కెర, పాలతో కలిపి సేవిస్తే హాయినా నిద్ర పడుతుంది. అశ్వగంధ చూర్ణానికి సమానంగా దానిమ్మ చూర్ణం పొడిని సమానంగా కలిపి, భోజనం తర్వాత ఒక స్పూను పొడి తేనెతో కలిపి నెలరోజుల పాటు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది.