గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:57 IST)

శెనగపిండితో స్నానం చేస్తే..?

సాధారణంగా చాలామంది షాంపుతో స్నానం చేస్తుంటారు. కొన్ని షాంపుల కారణంగా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. అయితే వెంట్రుకలు బాగా పెరగడానికి శెనగపిండి ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్ లేకుండా వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఒక్క శెనగపిండే మార్గమని చెబుతున్నారు. 
 
షాంపుకు బదులు ప్రతిసారీ శెనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాదు శిరోజాలు పట్టుకుచ్చులా కాంతివంతమై కుదుళ్లు కూడా గట్టిపడుతాయి. మూత్రవ్యాధులు గలవారు శెనగల వాడకం తగ్గించుట మంచిది.
 
శెనగల్లో చలువచేసే గుణాలున్నాయి. ఇవి రక్త దోషాలను పోగొట్టి బలాన్ని కలిగిస్తాయి. శెనగలు సులభంగా జీర్ణమవుతాయి. శెనగాకు ఆహారంగా వాడితే పిత్త వ్యాధులు నశిస్తాయి. అలాగే చిగుళ్ల వాపును తగ్గిస్తాయి. గజ్జి, చిడుము, తామర కలవారు ప్రతిరోజూ శెనగపిండితో రాసుకుని స్నానం చేస్తే ఆ వ్యాధులు మటుమాయమవడమే కాకుండా దేహానికి, ముఖానికి కాంతి వస్తుంది.