శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (19:52 IST)

ఆయుర్వేద జలంతో అధిక బరువు మాయం, ఎలా చేయాలి?

బరువు తగ్గాలంటే అందుకు తోడ్పడే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. వాటిలో చెప్పుకోదగ్గది ఆయుర్వేద జలం. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే ఈ జలాన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
ధనియాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, సోంపు అర టీ స్పూను, కాచిని నీళ్లు 4 కప్పులు.
 
తయారీ ఇలా..
మరిగే నీళ్లలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి నాననివ్వాలి. కొద్దిసేపటి తర్వాత వడగట్టి రోజంతా తాగుతూ వుండాలి. 
 
ఉపయోగాలు ఏమిటంటే..
ఆయుర్వేద జలం శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొడుతుంది. జీర్ణక్రియను సరిచేసి మెటబాలిజంను పెంచుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఒంట్లో నీరు నిల్వ వుండకుండా చూస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది.