శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (15:15 IST)

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? అల్లం టీ తాగండి..

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అల్లం టీ సులువుగా బరువు తగ్గొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. బరువును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లంలో వుంది. ముఖ్యంగా అల్లం టీతో సులువుగా ఎలా బరువు తగ్గవచ్చు. అల్లంటీని తయారు చేసుకుని అందులో తేనె గానీ, నిమ్మరసం గానీ కలుపుకుని ప్రతి రోజూ ఉదయం నోటిని శుభ్రం చేసుకున్న తర్వాత సేవించడం వలన అధిక బరువు ఉండేవారికి సులువుగా బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేయడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. 
 
అంతేగాకుండా.. దాల్చిన చెక్క పొడి కూడా బరువును సులభంగా కరిగిస్తుంది. ముందుగా ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని గ్లాస్ వేడి నీటిలో వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల తేనె కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున అర గ్లాస్, రాత్రి పడుకునే ముందు అర గ్లాస్ చొప్పున తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.