శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 డిశెంబరు 2019 (22:51 IST)

శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో కలిపి తేనెతో తీసుకుంటే...

బరువు తగ్గాలనుకునేవారు సహజసిద్ధమైన మార్గాలను అనుసరిస్తే సరిపోతుంది. 
 
1. బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేనెతో తీసుకోవాలి.
 
2. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠి పొడిని వేసి తీసుకోవాలి.
 
3. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి.
 
4. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి.
 
5. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది.
 
6. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠిపొడి, నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి.. పాలు పడతాయి.
 
7. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దను శొంఠిపొడి, నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది.