1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (19:14 IST)

టీ, కాఫీల్లో పంచదార కంటే బెల్లం కలుపుకుంటే?

టీ, కాఫీల్లో పంచదార కంటే బెల్లంను కలుపుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను కూడా బెల్లం పెంచుతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బెల్లం తీసుకుంచే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తం పరిశుభ్రంగా ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లివర్ సమస్యలకు కూడా బెల్లం ద్వారా చెక్ పెట్టవచ్చు.
 
నిత్యం బెల్లాన్ని తీసుకోవడం వల్ల శరీర భాగాలకు కావాల్సిన పోషకాలు, రసాయనాల్ని వేరు చేస్తుంది. అందువల్ల బెల్లం వల్ల లివర్ పరిశుభ్రంగా ఉంటుంది. శరీరంలో వేడిని కూడా తగ్గించే శక్తి ఈ బెల్లానికి ఉంది. ఓ గ్లాస్ వాటర్‌లో బెల్లం ముక్కను కలిపి తాగితే శరీరంలోని ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. 
 
శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. ఇంకా పేగుల్ని శక్తిమంతంగా చేసే మెగ్నీషియం కూడా బెల్లంలో ఉంటుంది. దీని ద్వారా పేగులు శక్తివంతంగా మారి.. జీర్ణ ప్రక్రియకు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పంచదార తింటే బరువు పెరుగుతారు. అదే బెల్లం తింటే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.