శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (19:12 IST)

జాజికాయ పొడితో కొలెస్ట్రాల్ మటాష్.. ఒబిసిటీ మాయం

జాజికాయ పొడి రోజూ వాడితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఒబిసిటీ మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఈ పొడిలోని పోషకాలు రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. జాజికాయ పొడి వల్ల దంత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. లివర్‌, కిడ్నీల్లో పేరుకుపోయే వ్యర్థాలు తొలగిపోతాయి. జాజికాయ చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది. 
 
జాజికాయ వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పూట భోజనంతో జాజికాయ పొడి తీసుకుంటే రోజూ రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. 
 
జాజికాయల పొడిని నిత్యం తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.