మంగళవారం, 16 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (11:44 IST)

కొండపిండితో కిడ్నిలో రాళ్లు మటాష్..

Konda Pindi
Konda Pindi
కొండపిండి మొక్క గురించి తెలుసా.. ఈ మొక్కలో ఎన్నో ఆయుర్వేద గుణాలున్నాయి. మూత్రపిండాల్లో ఉండే రాళ్లు కరిగిపోయి మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కొండపిండి బాగా పనిచేస్తుంది. 
 
ఈ సమస్యతో బాధపడే వారు కొండపిండి వేర్లు, గోక్షూర వేర్లు, ఒలిమిడి వేర్లు, ఉత్తరేణి వేర్లను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను మంచినీటితో కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య నయం అవుతుంది.
 
తలనొప్పితో బాధపడే వారు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి నుదుటికి పట్టులా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అంగశూల సమస్యతో బాధపడే వారు కొండపిండి మొక్క రసంలో జీలకర్ర చూర్ణాన్ని కలిపి వాడడం వల్ల అంగశూల సమస్య తగ్గుతుంది.  
 
ఈ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఆకులు దొరకని వారు ఆయుర్వేదం షాప్‌లో దొరికే కొండపిండి ఆకు పౌడర్ తెచ్చుకుని ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసి మరిగించి వడగట్టి ఉదయం పరగడుపున తాగాలి ఈ విధంగా 20 రోజుల పాటు తాగితే కిడ్నీ లో రాళ్ళు కరిగిపోతాయి కొండపిండి ఆకు ను పప్పుగా తయారు చేసుకొని కూడా తినవచ్చు. ఈ ఆకు తినడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు