1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (13:44 IST)

శీతాకాలంలో పుదీనా ఆకులతో ఆరోగ్యం ఎలా?

పుదీనా ఆకుల వాసనతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోమాథెరపీలో పుదీనా ఆకులను ఉపయోగిస్తారు. సుగంధ మొక్కల్లో పుదీనా ఒకటి. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుంది.
 
ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుంది. ఉత్సాహాన్ని నింపడంతో పాటు నీరసాన్ని దూరం చేస్తుంది. పుదీనా వాసన పీల్చడంతో తలనొప్పులు తగ్గడంతో పాటు, పూడుకుపోయిన సైనస్‌ గదులు శుభ్రమవుతాయి. మైగ్రేన్‌ తలనొప్పి సమస్య తగ్గిపోయేలా చేస్తుంది. నిద్రలేమిని పుదీనా ఆకులు దరిచేరనివ్వవు.
 
ఇంకా పుదీనా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరం చేస్తాయి. అందుకే వంటల్లో పుదీనాను వాడడం మంచిది. తరచూ కూర లేదా పచ్చళ్ల రూపంలో పుదీనా ఆకులను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
పుదీనా ఆకులతో చేసిన టీని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. పుదీనా ఆకుల కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది. పుదీనాలో ఉండే విటమిన్‌ సి, డీ, ఇ, బి లు.. క్యాల్షియం, పాస్పరస్‌ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.