శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (15:49 IST)

లైంగిక శక్తిని పెంచే లేత కొబ్బరి.. (video)

లేత కొబ్బరిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. లేత కొబ్బరిలో ఎన్నో పోషకాలున్నాయి. లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చేస్తుంది. బరువుతగ్గాలనుకునే వారు లేత కొబ్బరి తినాలి. లేత కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేత కొబ్బరి బయటకు పంపేస్తుంది. 
 
లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాల్ని బయటకు పంపుతాయి. అలాగే లైంగిక శక్తిని పెంచేందుకు, స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేత కొబ్బరిలో ఉన్నాయి. 
 
కొబ్బరి కాయల్లో పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే... దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలొస్తాయి. అదే లేత కొబ్బరైతే అలాంటి సమస్యలుండవు. అందుకే లేత కొబ్బరిని రోజుకు ఓసారైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.