శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (17:57 IST)

మందుబాబులు బీరకాయ తీసుకుంటే..?

మ‌ద్యం సేవించేవారు బీర‌కాయ తింటే లివ‌ర్‌ ప‌దిలంగా ఉన్న‌ట్టే. ఆల్కహాల్ సేవించ‌డం వ‌ల్ల‌ లివ‌ర్ దెబ్బ తింటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాంటి వారు బీర‌కాయ తింటే ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న లివ‌ర్‌ను రక్షిస్తుంది.

అందుకే మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి లివ‌ర్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అంతేకాదు బీరకాయల్లో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అజీర్ణం సమస్యల్ని తొలగిస్తుంది. అలాగే… తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
 
ఈ రోజుల్లో మనం తినే బయటి ఫుడ్ వల్ల మన బాడీలో రకరకాల నూనెలు, జిడ్డు పదార్థాలు… పేగులు, ఆహార నాళాలకు అతుక్కుపోతూ ఉంటాయి. వాటిపై బ్యాక్టీరియా ఇతర క్రిములు ఏర్పడి, అవి మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండేందుకు, వారానికి రెండుసార్లైనా బీరకాయను వండుకొని తినాలి. ఇది పొట్టను చల్లగా చేసి ఎంతో హాయిని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.