శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సందీప్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:54 IST)

పైల్స్‌కు చెక్ పెట్టే ఆ మూడు ఆయిల్స్?

మలబద్దకం, థైరాయిడ్‌, డయాబెటిస్‌ వలన అదే విధంగా మాంసం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వలన చాలా మందికి పైల్స్ వస్తాయి. ఇది వచ్చిన వారి బాధ వారికే తెలుస్తుంది. మల విసర్జన సమయంలో అధిక బాధ, రక్తం పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మంది భరించలేక ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. 
 
దీని నుండి ఉపశమనం పొందడానికి ఇంటి వద్దనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అవేమిటంటే, ఒక పాత్రలో నీరు తీసుకుని కొన్ని బిరియానీ ఆకులు మూడు వెల్లుల్లి రెక్కలు వేసి బాగా మరిగించాలి. చల్లార్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే పైల్స్ బాధించవు. తెల్ల చామంతి పువ్వును నీటిలో వేసి డికాక్షన్ కాయాలి. 
 
దానిని చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. చిన్న గ్లాస్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. వాటిని తీసుకుని ప్రభావిత ప్రాంతంలో అద్దాలి. కలబంద గుజ్జును రాసినా పైల్స్ బాధ నుండి తప్పించుకోవచ్చు. 
 
కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. టీ ట్రీ ఆయిల్‌ను ఆముదం లేదా బాదం నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తూ ఉండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే పైల్స్ తగ్గిపోతాయి.