మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (16:28 IST)

ఆయుర్వేదంతో చుండ్రు మాయం.. ఎలాగో తెలుసుకోవాలంటే?

చుండ్రు అనేది చాలా మందిలో ఉండే జుట్టు సమస్య. సరైన విధంగా జుట్టు సంరక్షణ విధానాలను అనుసరించకపోతే ఈ సమస్య వస్తుంది. ఇది అంత సాధారణంగా విడిచిపోదు. చుండ్రును సంపూర్ణంగా నివారించే ఉత్పత్తులు ఔషధాలు మార్కెట్‌లో లభించనప్పటికీ, ఆయుర్వేదం ద్వారా దీనిని నయం చేసుకోవచ్చు.


చుండ్రు నివారణ కోసం ఉపయోగించే ఆయుర్వేద ఉత్పత్తులు వెంట్రుకల పైనే కాకుండా జుట్టు మూలాలపై కూడా ప్రతిభావంతంగా పని చేసి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటి వలన ఎలాంటి హానికర ప్రభావం ఉండదు. 
 
చుండ్రు చికిత్సకు మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి ఆయుర్వేద హెయిర్ ఆయిల్ వాడకం ఒక ఉత్తమ మార్గం అని చెప్పాలి. ఈ నూనెలను కొబ్బరి నూనె, వేప మరియు కపూర్‌లను ఉపయోగించి తయారుచేస్తారు. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు వ్యతిరేక శిలీంద్ర కారకాలు గల ఈ నూనె చుండ్రు నయం చేయడానికి సమర్ధవంతంగా దోహదపడుతుంది. జుట్టుకి బలాన్ని అందించే పొడిని గోరింటాకు, స్వీట్ ఫ్లాగ్, బ్రింగరాజ్, రుద్రాక్ష, కష్మీర చెట్టు, హ్రిద, బెహాడ, ఉసిరి, మ్యాజిక్ గింజ మరియు మందార ఆకులు కలిపి తయారు చేస్తారు. 
 
జుట్టుకి బలాన్ని అందించే పొడిలో కల అన్ని పదార్ధాలు బాక్టీరియాతో పోరాడి జుట్టుని ఆరోగ్యకరంగా, బలంగా ఉంచుతాయి. ఆయుర్వేద షాంపులలో శిఖాకాయ మరియు రితాలు కలిగి ఉంటాయి. ఈ రెండు ఆయుర్వేద మూలికలు జుట్టుని శుభ్ర పరచడంతో పాటు చికిత్సకి కూడా ఉపయోగపడుతాయి. కొన్ని షాంపూలలో వేపను కూడా చేర్చుతారు. మెంతులు, నారింజ, నిమ్మ జుట్టుకు ఆయుర్వేద కండీషనర్‌లుగా ఉపయోగపడతాయి. వారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా ఆముదంతో జుట్టును మర్ధనా చేయాలి. 
 
చుండ్రు నివారించడానికి, పూర్తి జుట్టు సంరక్షణకు ముఖ్యంగా మెంతులు చాలా ప్రభావవంతమైనవి. రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారు వాటిని మెత్తని పేస్ట్‌లా రుబ్బాలి. ఇపుడు ఒక అరగంట పాటు మీ జుట్టుకి ఈ పేస్ట్‌ని పట్టించి తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేయాలి. చుండ్రు చికిత్స కోసం వేప మరొక సమర్థవంతమైన మూలిక. నీటిని వేప ఆకులతో కాచి ఆ నీటిని జుట్టుని కడగడానికి ఉపయోగిస్తారు.
 
టీ చెట్టు నూనె చుండ్రు నివారణకి సమర్థవంతమైనది. ఒక కప్పు వేడి నీటిలో టీ చెట్టు నూనెని ఒకటి టీస్పూన్ కలపాలి. అదే నీటితో మీ జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత మీ జుట్టుని నిమ్మ నీటితో తడిపి ఆ తర్వాత మామూలు నీటితో మీ జుట్టుని శుభ్రం చేయాలి. తులసి ఆకులను మరియు ఉసిరిని కలిపి పేస్ట్‌లా చేయండి. ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయండి. 
 
ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయండి. వెనిగర్, నిమ్మరసంను సమాన పరిమాణంలో తీసుకొని మీ జుట్టుకి మర్దనా చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేయండి. కలబంద గుజ్జుతో మీ జుట్టును మర్దనా చేసి, 15 నిమిషాలు అలానే వుంచి తేలికపాటి షాంపూతో శుభ్రం చేయాలి.