మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:37 IST)

అలసటను దూరం చేసుకోవాలంటే.. ఇలా చేయండి..

ప్రతి మనిషికీ ఏదో ఒక సందర్భంలో అనారోగ్యం వస్తుంది. కొన్ని వెంటనే తగ్గిపోతే, మరికొన్ని తీవ్రంగా బాధపెడతాయి. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడల్లా వైద్యుల దగ్గరకు వెళ్లడం కుదరకపోవచ్చు. చిన్న చిన్న సమస్యలకు వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు. ఇబ్బంది నుండి బయటపడవచ్చు. అలాంటి కొన్ని చిట్కాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
కడుపుబ్బరం లేదా కడుపులో మంట ఉంటే నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి చల్లార్చి తాగడం మంచిది. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు చింతపండు రసంతో చేసిన రసాన్ని అన్నంలో కలుపుకుని తినండి. ఎండలో తిరిగి నీరసంగా, నిస్సత్తువగా ఉంటే, అలసటను దూరం చేసుకోవడానికి కొబ్బరి నీళ్లు లేదా బత్తాయి పండ్ల రసాన్ని ఒక గ్లాసుడు తీసుకోండి. 
 
రోజూ తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజూ కాకరకాయ రసాన్ని నోట్లో వేసి పుక్కిలిస్తూ ఉంటే నాలుక పూత, పళ్లు పుచ్చిపోవడాన్ని అరికట్టవచ్చు. ఒక పచ్చి కరక్కాయను అరగదీసి దాని రసాన్ని తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.