మంగళవారం, 13 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:48 IST)

ఇంగువ చూర్ణంతో ఆవునెయ్యిని కలుపుకుని..?

శరీరంలో రోగనిరోధక శక్తి లోపిస్తే అనేక రోగాలు మనల్ని కమ్ముకుంటాయి. వాటి నుండి బయటపడటానికి అనేక రకాల మందులు తీసుకుంటాం. దానితోపాటు పౌష్టికాహారం కూడా తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. వైరస్ వలన వచ్చే అంటు వ్యాధులలో జలుబు, దగ్గు కూడా ఉన్నాయి. జలుబు వలన తలనొప్పి, ఆయాసం, తుమ్ములు వస్తాయి. 
 
అందుకే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. జలుబు వస్తే మనం దానికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. జలుబుకి ఉసిరికాయలు మంచి పరిష్కారం. రోజూ ఉసిరికాయలను నేతిలో వేయించుకుని తేనెతో కలుపుకుని తింటే మంచి ఫలితం కనబడుతుంది. 
 
ఇంగువ చూర్ణాన్ని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా ఆవునెయ్యి కలుపుకుని ప్రతిరోజూ మూడుపూటలా సేవిస్తే ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. అయనా కూడా తగ్గకపోతే, వాము చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని వేడినీళ్లల్లో మరిగించుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణుల సూచన.