శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (22:58 IST)

బరువు తగ్గవచ్చునని మహిళలు అరటి పండ్లు తింటున్నారా? (video)

banana
అరటి పండ్లలోని పొటాషియం, క్యాలరీలు పుష్కలంగా వుండటంతో అరటి పండు తీసుకోవడం ద్వారా అరటి పండ్లను తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే అరటిపండ్లు తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అరటిపండ్లు కొవ్వును తగ్గించవు, కొవ్వును పెంచుతాయని వారు చెప్తున్నారు. అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అరటిపండ్లు శరీరంలోకి చేరే క్యాలరీలను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అరటిపండులో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 
 
అరటిపండ్లు ఇతర పండ్ల కంటే ఎక్కువ కేలరీలను శరీరంలోకి నింపుతాయి. ఒక కప్పు ఆపిల్‌లో కేవలం 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఒక కప్పు అరటిపండు నుండి గ్రహించిన కేలరీల పరిమాణం 135. అంటే యాపిల్ కంటే రెట్టింపు కేలరీలు అరటిపండు ద్వారా శరీరంలోకి చేరుతాయి.
 
అలాంటి అరటి పండ్లను అధికంగా తీసుకుంటే..?
 


ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది
అధిక స్థాయి ఫ్రక్టోజ్ యువకులలో టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది
పండు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
కొంతమందిలో కడుపు నొప్పికి కారణం కావచ్చు 
కొందరిలో అలర్జీ రావచ్చు
చాలా విటమిన్ బీ6 నరాల లోపల సమస్యలను కలిగిస్తుంది
విపరీతమైన అలసట మైగ్రేన్‌లకు కారణమవుతుంది
అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది.