గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (18:58 IST)

మహిళలు దోసకాయ రసం తాగితే..

దోసకాయ రసం శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. అంతేకాదు దీన్ని రోజూ క్రమం తప్పకుండా తాగితే విషపదార్థాలన్నీ తొలగిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దోసకాయలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, కె పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో విటమిన్ లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు దోసకాయ రసం త్రాగాలి.
 
కీరదోసకాయలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తాగడం వల్ల శరీరానికి కావల్సిన మినరల్స్ అందుతాయి. దోసకాయ రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయాన్నే దోసకాయ రసం తాగాలి. 
 
దోసకాయలో విటమిన్ ఎ ఉన్నందున, దీనిని తాగడం వల్ల కంటి సమస్యలను నివారించవచ్చు. లో-బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు దోసకాయ రసం తాగితే, రక్తపోటు స్థిరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.