సాల్మన్ చేపలను తింటే జుట్టు తెల్లబడదట...
జుట్టు తెల్లబడకుండా వుండాలంటే.. సాల్మన్ చేపను తీసుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్లను స్రవించేందుకు సాల్మన్ చేపలో వుండే సెలీనియం తప్పక అవసరమని వారు సూచిస్తున
జుట్టు తెల్లబడకుండా వుండాలంటే.. సాల్మన్ చేపను తీసుకోవాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్లను స్రవించేందుకు సాల్మన్ చేపలో వుండే సెలీనియం తప్పక అవసరమని వారు సూచిస్తున్నారు. అందుకే జుట్టు తెల్లబడనీయకుండా ఆపాలంటే.. వారంలో రెండు లేదా మూడుసార్లు సాల్మన్ చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.
అలాగే కోడిగుడ్లను రోజుకొకటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు ఏమాత్రం నెరవకుండా వుండాలంటే.. బీ-12 కలిగివున్న కోడిగుడ్డును తీసుకోవాలి. ఇంకా పచ్చని ఆకుకూరలు జుట్టు రంగును మారనీయదు. పచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్ బీ లభిస్తుంది. సాధారణంగా, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి.. శిరోజాలకు రక్తప్రసరణను ఆకుకూరలు మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.